
.jpg&w=3840&q=75)
రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయ రంగం, ముఖ్యంగా ఉద్యాన పంటల స్థితిగతుల పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ సెక్రటేరియట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పూర్వోదయ పథకం ద్వారా ఉద్యాన పంటల అభివృద్ధి, రైతులకు అందించాల్సిన సబ్సిడీలు, మార్కెటింగ్ సదుపాయాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు పై సీఎం వివరంగా ఆరా తీశారు. రాయలసీమ మరియు ప్రకాశం జిల్లాల్లో ఏర్పాటు చేసిన 92 హార్టికల్చర్ క్లస్టర్ల పనితీరును కూడా ఆయన పరిశీలించారు.
ఉద్యాన పంటలు సాగు చేస్తున్న 5.98 లక్షల మంది రైతులకు ఎక్కువ లాభం చేకూరేలా ప్రభుత్వం కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తోందని, అందుకోసం సమగ్ర సమాచారాన్ని సేకరించి విశ్లేషించాలని సీఎం అధికారులకు సూచించారు.
అలాగే, నీటిపారుదల సదుపాయాలు, రవాణా సౌకర్యాలు, సాగునీటి ప్రాజెక్టులు, పంచాయతీ రాజ్ రోడ్ల అభివృద్ధి, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, గోడౌన్ల ఏర్పాటు ఈ అన్ని అంశాలు కలిసి రైతుల ఆదాయాన్ని పెంచేలా ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నాయని సీఎం తెలిపారు.
ప్రస్తుతం మారుతున్న ఆహారపు అలవాట్లు, మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్, కొత్త టెక్నాలజీల వినియోగం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఉద్యాన పంటల సాగును మరింత విస్తరించే దిశగా దీర్ఘకాల ప్రణాళిక రూపొందించాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!