

తుఫాను "మోంథా" ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్రానికి కేంద్ర సాయం తీసుకురావాలని నిర్ణయించారు. ప్రాథమిక అంచనా ప్రకారం మొత్తం నష్టం రూ.5,625 కోట్లకు చేరిందని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు రెండు మూడు రోజుల్లో తేలుతాయని ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా 450 మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారికి రూ.900 కోట్ల వరకు పరిహారం అవసరమని అంచనా. అదేవిధంగా రహదారుల పునరుద్ధరణకు రూ.3,000 కోట్లు, తీరప్రాంత ప్రజలకు ఇళ్ల కోసం రూ.350 కోట్లు, అలాగే విద్యుత్, తాగునీటి సరఫరా పునరుద్ధరణకు మరో రూ.1,000 కోట్లు అవసరమని అధికారులు నివేదిక ఇచ్చారు.
గతంలో వర్షాల కారణంగా రాష్ట్రానికి రూ.6,500 కోట్ల నష్టం జరిగినప్పటికీ, కేంద్రం నుండి తగిన సాయం రాలేదని ప్రభుత్వం గుర్తుచేసుకుంది. అందుకే ఈసారి సీఎం స్వయంగా ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు విపత్తు నిర్వహణ శాఖ అధికారులను కలవాలని నిర్ణయించారు. అలాగే సీఎం చంద్రబాబు త్వరలో బీహార్ పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ ఎన్డీయే తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనే ముందు ఢిల్లీ పర్యటనను పూర్తి చేయాలని భావిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!