

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈ నెల 18 న అమరావతిని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమై రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, విద్య రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై చర్చ జరగనుంది.
గత ఏడాది మార్చిలో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఆరోగ్య సేవల అనలిటిక్స్, డిజిటల్ వ్యవసాయం, పాలనలో సాంకేతికత వినియోగం ద్వారా ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు అమలుపై సీఎం చంద్రబాబు, బిల్ గేట్స్ మధ్య సమగ్ర చర్చ జరిగే అవకాశముంది. అంతేకాకుండా అమరావతి క్వాంటమ్ వ్యాలీలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులపై ఉన్న ప్రచారంపై కూడా అదే రోజు స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!