

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో నియామక పత్రాలు అందుకుంటున్న ఓ మహిళా ఆయుష్ డాక్టర్ హిజాబ్‌ను సీఎం స్వయంగా తొలగించిన ఘటన తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, వేదికపై ఉన్న కొందరు నవ్వడం కూడా విమర్శలకు కారణమైంది.
ప్రతిపక్షాలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించాయి. ఆర్జేడీ నితీశ్ కుమార్ మానసిక స్థితి సరిగా లేదేమో అని విమర్శించగా, కాంగ్రెస్ ఈ చర్యను అసహ్యకరంగా పేర్కొని సీఎం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. రాష్ట్రంలో మహిళల భద్రతపై కూడా తీవ్రమైన ప్రశ్నలు తలెత్తాయి. ఈ కార్యక్రమంలో మొత్తం 1,283 మంది ఆయుష్ వైద్యులకు నియామక పత్రాలు అందజేయబడ్డాయి. వీరిలో ఆయుర్వేద, హోమియోపతి, యునానీ వైద్యులు ఉండగా, ఆయుష్ మెడికల్ సర్వీసులు మరియు నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో వివిధ ఆరోగ్య సంస్థల్లో నియమించనున్నారు. ఈ సంఘటన బీహార్ రాజకీయాల్లో మరోసారి చర్చలకు కారణమైంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!