

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఎదుట హాజరుకానున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కీలకంగా పనిచేసిన ఆయన, అనంతరం 2024 లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు జరుగుతున్న దర్యాప్తులో ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం.
ఈ కేసుకు సంబంధించి పలువురు రాజకీయ నాయకుల వాంగ్మూలాలను సేకరిస్తున్న సిట్ అధికారులు, చామల కిరణ్ కుమార్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను కూడా నమోదు చేయనున్నారు. ఇందుకోసం శుక్రవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు హాజరుకావాలని పోలీసులు సమాచారం ఇచ్చారు. ఈ విచారణలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!