
సినిమాలు

పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాల పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఇంటర్నేషనల్ సంతాల్ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి అక్కడికి వెళ్లిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రోటోకాల్ ఇవ్వలేదనే విషయం ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది.
ఈ అంశంపై స్పందించిన సీఎం చంద్రబాబు, రాష్ట్రపతి పదవికి తగిన గౌరవం ఇవ్వకుండా వ్యవహరించడం బాధాకరమని అన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం అయినా రాష్ట్రపతి పట్ల అత్యంత గౌరవం, మర్యాదలతో వ్యవహరించడం అవసరమని ఆయన పేర్కొన్నారు.
రాజ్యాంగ పదవులు రాజకీయాలకు అతీతంగా ఉంటాయని, వాటి గౌరవం మరియు పవిత్రతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ ఘటన పై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!