
క్రీడలు

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అశోక్ గెహ్లోట్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఈరోజు బ్రతికుంటే భారతీయ జనతా పార్టీను నిషేధించేవారని ఆయన పేర్కొన్నారు. జైపూర్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ బీజేపీ హిందుత్వ, మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.
మతాధారిత రాజకీయాలు దేశంలో ప్రమాదకర పరిస్థితులను సృష్టిస్తున్నాయని, అన్ని మతాలకు సమాన గౌరవం కల్పించే రాజ్యాంగ స్ఫూర్తికి ఇది విరుద్ధమని గెహ్లోట్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తూ, 1975లో విధించిన ఎమర్జెన్సీని ప్రస్తావిస్తూ గెహ్లోట్‌పై విమర్శలు గుప్పించారు. ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ హిందుత్వ, సెక్యులరిజం, రాజకీయాల్లో మత పాత్రపై చర్చలకు దారితీసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!