

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఇంటిపై గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టిన ఘటన బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జనవరి 23 సాయంత్రం బళ్లారి కంటోన్మెంట్లోని మోడల్ హౌస్కు ఈ దాడి జరిగింది. ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండటంతో జనార్ధన్ రెడ్డి బెంగళూరులోనే ఉన్నారు. ఇంటి భవనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారని ఆయన సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు.
ఈ దాడి వెనుక ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయుల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ఘటన విషయం తెలుసుకున్న జనార్ధన్ రెడ్డి బళ్లారి జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల బ్యానర్ ఘర్షణలు జరిగిన కొన్ని వారాలకే ఈ ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. బళ్లారి ఎస్పీతో మాట్లాడినట్లు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని జనార్ధన్ రెడ్డి వెల్లడించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!