
.jpg&w=3840&q=75)
రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నం డేటా సెంటర్ల కొత్త కేంద్రంగా మారే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. గూగుల్ డేటా సెంటర్ ప్రతిపాదన వచ్చాక, మరిన్ని అంతర్జాతీయ సంస్థలు కూడా విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా ప్రముఖ ఐటీ సంస్థ కంట్రోల్–ఎస్, 350 మెగావాట్ల భారీ డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది.
ఇప్పటికే అనేక కంపెనీలు విశాఖలో డేటా సెంటర్లు స్థాపించాలనే ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాయి. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, భూముల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత సంస్థలకు సూచించింది.
బుధవారం, కంట్రోల్–ఎస్ ప్రతినిధులు రెవెన్యూ అధికారులతో కలసి ప్రతిపాదిత భూములను స్వయంగా పరిశీలించారు. అదేవిధంగా, గ్లోబల్ మార్కెట్లో గుర్తింపు పొందిన మరో రెండు ప్రముఖ సంస్థల ప్రతినిధులు కూడా విశాఖలో భూముల పరిశీలన పూర్తి చేశారు. పరిశీలించిన భూముల పై సంతృప్తి వ్యక్తం చేసిన ఈ సంస్థలు త్వరలో అధికారికంగా తమ ప్రతిపాదనలు సమర్పించనున్నారు.
ఈ ప్రతిపాదనలు ఎస్ఐపీసీ, ఎస్ఐపీబీ దశలను దాటి, ఈ నెల 25 న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి. మూడు డేటా సెంటర్లు కూడా విశాఖను కేంద్రంగా ఎంచుకోవడంతో, ఉత్తరాంధ్ర తీర ప్రాంతం సమీపం భవిష్యత్తులో డేటా సెంటర్ల ప్రధాన హబ్‌గా మారే దిశగా ముందుకెళ్తోందని తెలుస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!