

దేశ రాజకీయాల్లో ఒక్కప్పుడు కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలోకి జారిపోయింది. ఎన్నాళ్లుగానో దేశాన్ని పాలించిన జాతీయ పార్టీగా ఉన్నా, ఇటీవలి కాలంలో ఆ పార్టీ స్థితి రోజురోజుకు బలహీనమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కు తెలంగాణ, కర్ణాటకల్లో మాత్రమే విజయం దక్కింది. అది కూడా పార్టీ శక్తితో కాదని, అక్కడి స్థానిక నాయకుల ప్రభావంతో వచ్చిన ఫలితమని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
ఇక కొత్తగా జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా నిరాశపరిచింది. గత ఎన్నికల్లో పొందిన స్థాయిని కూడా నిలబెట్టుకోలేకపోయింది. ఇదిలా ఉండగా, వచ్చే ఆరు నెలల్లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కీలక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్కు గణనీయమైన బలం లేకపోవడంతో, అక్కడ డీఎంకే మరియు తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతోంది.
డీఎంకే మరియు టీఎంసీ ఇండియా కూటమిలో భాగమైనప్పటికీ, రాష్ట్ర ఎన్నికల విషయంలో మాత్రం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడంపై ఆసక్తి చూపడం లేదు. బీహార్ ఎన్నికల తర్వాత పరిస్థితి మారుతుందని భావించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మరింత కష్టాల్లో పడినట్టే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రభావం కనబడకపోవడంతో, ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ను పూర్తిగా పక్కన పెట్టే అవకాశాలు బలంగా చర్చకు వస్తున్నాయి.
దీంతో కాంగ్రెస్ పార్టీ వచ్చే నెలల్లో మరింత బలహీనపడే పరిస్థితి కనబడుతోంది. రాజ్యసభలో కూడా కాంగ్రెస్కు ఉన్న బలం తగ్గే అవకాశం ఉంది. బీహార్ ఫలితాల కారణంగా ఆ రాష్ట్రం నుంచి ఎక్కువగా బీజేపీ అభ్యర్థులు రాజ్యసభకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. దీంతో కేంద్ర శాసనసభలో కాంగ్రెస్కు ఇప్పటికంటే ఇంకా కఠినమైన రోజులు ఎదురవుతాయని విశ్లేషకులు అంటున్నారు.
ఇప్పటికే అనేక చిన్న పార్టీలు కాంగ్రెస్కు దూరమవుతున్న సంకేతాలు ఇస్తున్నాయి. బీహార్ తర్వాత ఈ పార్టీలు ఎన్డీఏ వైపుకు మొగ్గుచూపుతున్నాయన్న ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. మొత్తం ఎలా చూసుకున్నా, 2029 సాధారణ ఎన్నికలకు అడుగు పెట్టే సమయానికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత కష్టాల్లో పడే అవకాశమే ఎక్కువగా ఉన్నట్టు జాతీయ రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కాంగ్రెస్ ఈ దిగజారుతున్న పరిస్థితిని ఎలా ఎదుర్కుంటుంది? పార్టీని పునరుద్ధరించడానికి ఏ మార్గం ఎంచుకుంటుంది? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.







.jpg&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!