
గాసిప్స్

2017 లో కర్నాటకలో హత్యకు గురైన ప్రముఖ మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేష్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీకాంత్ పంగార్కర్ తాజాగా రాజకీయాల్లో విజయం సాధించారు. మహారాష్ట్రలోని జల్నా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
నేడు విడుదలైన ఎన్నికల ఫలితాల ప్రకారం, వార్డు నంబర్ 13 నుంచి పోటీ చేసిన పంగార్కర్ తన ప్రత్యర్థులను ఓడించి 2,621 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బీజేపీతో పాటు ఇతర రాజకీయ పార్టీల అభ్యర్థులు కూడా ఓటమిని ఎదుర్కొన్నారు.
ఫలితాలు వెలువడిన వెంటనే ఆయన మద్దతుదారులతో కలిసి సంబరాలు చేసుకుంటూ విజయాన్ని జరుపుకున్నారు. ఈ పరిణామం రాజకీయంగా, సామాజికంగా విస్తృత చర్చకు దారి తీస్తోంది.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!