
గాసిప్స్

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2023లో వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జరిగిన ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. మైసూరు జిల్లా BJP కార్యకర్త కె. శంకర అనే వ్యక్తి 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం 125A సెక్షన్ కింద ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో సిద్ధరామయ్య తన సహచరుల ద్వారా ఓటర్లకు నగదు, బహుమతులు పంపించి అవినీతి చేశారని, దీనివల్ల ఎన్నిక చెల్లదని ఆరోపించారు. ఈ ఎన్నికను రద్దు చేసి, ముఖ్యమంత్రి అర్హతను రద్దు చేయాలని కోరారు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సిద్ధరామయ్య నాలుగు వారాల్లో తమ వాదనలు సమర్పించాలి. సిద్ధరామయ్య లీగల్ టీమ్ సాక్ష్యాలు లేవని డిఫెండ్ చేస్తుండగా, విపక్షం పూర్తి ఆధారాలు ఉన్నాయని చెబుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!