
సినిమాలు

టీటీడీలో జరిగిన అక్రమాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. చట్టం ఏ మతానికైనా సమానంగా ఉండాలని, కులం–భాష–ప్రాంతం పేర్లతో హిందువులను విభజించడం పెద్ద తప్పిదమని ఆయన పేర్కొన్నారు. ఇతర మతాలను మెప్పించేందుకు చేసే రాజకీయాలు పూర్తిగా ఆపాల్సిన అవసరం ఉందని చెప్పారు.
హిందూ మెజారిటీ అనేది ఒక అపోహ మాత్రమేనని, సనాతన ధర్మంపై ప్రతి ఒక్కరూ ధైర్యంగా మాట్లాడాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తిరుమల పట్టువస్త్రం స్కాంపై కూడా స్పందించిన ఆయన, టీటీడీలో అనేక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని, వాటిపై విచారణ జరపాలని కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించిందని తెలిపారు. పరకామణి అంశంపై జగన్ చేసిన వ్యాఖ్యలు తగవని, అదే పరిస్థితి ఆయన మతంలో జరిగి ఉంటే దాన్ని చిన్న విషయం అని కొట్టిపారేసేవారా? అంటూ ప్రశ్నించారు.




.png&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!