

మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సతీ లీలావతి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ ప్రారంభించింది. థియేటర్లలో విడుదలైన రెండు వారాల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి రావడం ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మీడియం బడ్జెట్ సినిమాలకు వేగవంతమైన డిజిటల్ రిలీజ్ ట్రెండ్ పెరుగుతున్న నేపథ్యంలో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తెలుగు, తమిళ్ ఆడియోలతో పాటు ఇంగ్లీష్ సబ్టైటిల్స్లో కూడా సినిమా అందుబాటులో ఉంది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిన ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి తన కామెడీ టైమింగ్, నటనతో మంచి ఆకట్టుకున్నారని ప్రేక్షకులు చెబుతున్నారు. భారీ యాక్షన్ లేదా సీరియస్ డ్రామా కాకుండా సరదాగా నవ్వుకునే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సినిమా రూపొందింది. ప్రస్తుతం ప్రాంతీయ సినిమాలకు ఓటీటీలో పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో సన్ నెక్స్ట్ కూడా వరుస డిజిటల్ ప్రీమియర్స్తో తన లైబ్రరీని బలోపేతం చేస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!