

రవితేజ నటించిన ‘ఇరుముడి’ ఓటీటీలోనూ సత్తా చాటుతోంది. సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు ఉన్న నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 10 చార్ట్స్‌లో నాన్-ఇంగ్లిష్ సినిమాల విభాగంలో ఈ తెలుగు చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. తాజా చార్ట్స్ ప్రకారం, ఏడు రోజుల వ్యవధిలో ‘ఇరుముడి’ 3.4 లక్షల వీక్షణలను నమోదు చేసి అగ్రస్థానానికి చేరుకుంది.
అంతకుముందు వారంలో మూడో స్థానంలో ఉన్న ఈ సినిమా రెండు స్థానాలు ఎగబాకి నంబర్ వన్‌గా నిలిచింది. గత వారం అగ్రస్థానంలో ఉన్న సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ను వెనక్కి నెట్టి ‘ఇరుముడి’ టాప్‌లోకి వచ్చింది. ఆసక్తికరంగా, ఓటీటీలో విడుదలైన తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమా 3.4 లక్షల వీక్షణలను నమోదు చేసింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా, ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర, సాయికుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!