

తమిళ నటుడు జీవా నటించిన ‘తలైవర్ తంబి తలైమైయిల్’ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 15 న కేవలం తమిళంలోనే విడుదలైంది. విడుదలైన వెంటనే మంచి స్పందన పొందింది. ఈ ఏడాది పొంగల్ సందర్భంగా విడుదలైన సినిమాల్లో కోలీవుడ్‌లో అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాను దర్శకుడు నితీష్ సహదేవ్ తెరకెక్కించారు. జీవాకు జోడీగా ప్రార్థన నటించింది. మలయాళంలో ‘ఫెలిమి’ అనే హిట్ సినిమా తీసిన నితీష్‌కు ఇది తొలి తమిళ చిత్రం కావడం ప్రత్యేకం.
ఇప్పుడు ఈ హిట్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో సడెన్‌గా స్ట్రీమింగ్కు వచ్చింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా విడుదల చేయడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. థియేటర్లో కేవలం తమిళ్లో మాత్రమే విడుదలైన ఈ చిత్రం, ఓటీటీలో మాత్రం తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చింది. సుమారు రూ. 15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!