

అభిరామ్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన తెలుగు ఎమోషనల్ అడ్వెంచర్ చిత్రం ‘హ్యాపీ జర్నీ’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఈ శుక్రవారం నుంచి సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ కానుంది. దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఇందులో సీనియర్ నటీమణులు అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీతో పాటు జినిషా అలిశెట్టి, పాయల్ రాధాకృష్ణ, సునయన, రూప శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించారు.
వేర్వేరు వయసులు, సామాజిక నేపథ్యాలకు చెందిన ఏడుగురు మహిళలకు లక్కీ డ్రా ద్వారా యూరప్ వెళ్లే అవకాశం దక్కుతుంది. సావిత్రి (అన్నపూర్ణమ్మ), చాముండేశ్వరి (ఆమని), నయన (జినిషా అలిశెట్టి), శ్రీలత (ఝాన్సీ), తన్వి (పాయల్ రాధాకృష్ణ), దివ్య (సునయన), విహాన (రూప శ్రీనివాస్) ఈ ప్రయాణంలో భాగమవుతారు. గ్రేట్ ఆంధ్ర ట్రావెల్స్ నిర్వహించే గోవింద్ (వంశీ), అప్పారావు (రవి శివతేజ) వారికి గైడ్స్‌గా వ్యవహరిస్తారు. సరదా విహారయాత్రగా మొదలైన ఈ ప్రయాణం క్రమంగా భావోద్వేగాలతో కూడిన అనుభవంగా మారుతుంది. ఈ క్రమంలో మహిళలు ఒకరినొకరు అర్థం చేసుకోవడం, తమ జీవితాలకు సంబంధించిన నిజాలను తెలుసుకోవడం, విడిపోయిన కుటుంబాలు తిరిగి కలవడం వంటి అంశాలతో కథ ముందుకు సాగుతుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!