

ప్రైమ్ వీడియో తమ కొత్త ప్రైమ్ ఒరిజినల్ చిత్రం SYSTEM ట్రైలర్‌ను విడుదల చేసింది. పవర్, న్యాయం మధ్య జరిగే పోరాటాన్ని కోర్ట్ డ్రామా నేపథ్యంలో ఆసక్తికరంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి అశ్విని అయ్యర్ తివారి దర్శకత్వం వహించారు. ఇందులో సోనాక్షి సిన్హా, జ్యోతిక, అశుతోష్ గోవరికర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ నెల 22 నుంచి ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో స్ట్రీమింగ్ కానుంది.
ట్రైలర్లో నేహా అనే యువ లాయర్ పాత్రలో సోనాక్షి సిన్హా కనిపించారు. తన తండ్రి లా ఫర్మ్‌లో పార్ట్నర్ కావాలని కలలు కనే ఆమె, తన ప్రతిభను నిరూపించుకునేందుకు పోరాడుతుంది. ఈ క్రమంలో కోర్ట్ స్టెనోగ్రాఫర్ సారిక పాత్రలో నటించిన జ్యోతికతో కలిసి పని చేస్తుంది. అయితే సారికకు కొన్ని రహస్య ఉద్దేశాలు ఉన్నట్లు ట్రైలర్ సూచిస్తోంది. భావోద్వేగభరితమైన కోర్ట్ సన్నివేశాలు, ఆలోచింపజేసే డైలాగులు ట్రైలర్‌ను మరింత ఆకట్టుకునేలా చేశాయి. “పవర్ ముందు నిజం నిలబడగలదా?” అనే ప్రశ్నను సినిమా ప్రధానంగా ముందుకు తీసుకువస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!