

చార్మింగ్ స్టార్ శర్వానంద్ ప్రస్తుతం తన కెరీర్లో మంచి ఫామ్లో ఉన్నాడు. సంక్రాంతికి వచ్చిన “నారీ నారీ నడుమ మురారి” విజయంతో, ఇప్పుడు ఆయన “బైకర్” సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మంచి సాంకేతిక ప్రమాణాలతో రూపొందిన ఈ చిత్రం వచ్చే నెల 3 న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమా తర్వాత శర్వానంద్ సంపత్ నంది దర్శకత్వంలో “భోగి” అనే మరో చిత్రంలో నటిస్తున్నాడు. మాస్ వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ముఖ్యమైన వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రముఖ డిజిటల్ వేదిక నెట్ఫ్లిక్స్ ఈ చిత్రానికి సంబంధించిన ప్రసార హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. సాధారణంగా టీజర్ లేదా ట్రైలర్ తర్వాతే ఇలాంటి ఒప్పందాలు జరుగుతాయి. కానీ ఈ సినిమా విషయంలో షూటింగ్ దశలోనే ఒప్పందం కుదరడం విశేషం. కె కె రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది.

















.png&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!