

ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్ లాంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో రాజ్ తరుణ్... తర్వాత సినిమాలు చేసినా ఒక్క హిట్ కూడా లేక దాదాపు కనుమరుగైపోయాడు. గత ఏడాది వచ్చిన తిరగబడరా సామీ ఫలితం కూడా నిరాశపరిచింది.ఇప్పుడు ఆయన “చిరంజీవ” అనే కొత్త ఓటీటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం నవంబర్ 7 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది.
‘జబర్దస్త్’ ఫేమ్ అభి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ట్రైలర్ బట్టి చూస్తే ఒక ప్రమాదంలో గాయపడ్డ హీరోకి, ఎవరు ఎంత కాలం బతుకుతారో కనిపించే శక్తి వస్తుంది. ఈ సూపర్ నేచురల్ గిఫ్ట్‌తో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా అతడిని వేధిస్తుంటాయి. ఈ పరిస్థితుల నుంచి ఎలా బయటపడ్డాడు? అదే కథలోని మిస్టరీగా కనిపిస్తోంది.నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న ఈ ఆహా మూవీతో రాజ్ తరుణ్ మళ్లీ ప్రేక్షకుల మనసును గెలుచుకుంటాడా? అన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.












.avif&w=3840&q=75)


కామెంట్స్ (1)
best of luck raj