
జనరల్

దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తీ తరేజా ప్రధాన పాత్రల్లో నటించిన ‘కేజేక్యూ: కింగ్ జాకీ క్వీన్’ 1990 నేపథ్యంలో సాగే పీరియాడిక్ క్రైమ్ డ్రామా. కేకే దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే అమెజాన్ ప్రైమ్ వీడియోలో సడన్‌గా స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ‘కేజేక్యూ: కింగ్ జాకీ క్వీన్’ తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో వీక్షించవచ్చు. ఈ చిత్రానికి పూర్ణచంద్ర తేజస్వీ సంగీతం అందించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!