

పీరియాడిక్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ‘కాంత’ తాజాగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బొర్సే, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రలో కనిపించారు.
సినిమా విడుదలైన మొదటి రోజున మంచి స్పందన వచ్చినా, తర్వాత మౌత్‌టాక్ ప్రభావంతో వసూళ్లు తగ్గిపోయాయి. దీంతో ఆశించిన స్థాయి విజయాన్ని ఈ సినిమా సాధించలేకపోయింది. థియేట్రికల్‌గా పెద్దగా రాణించకపోయినా, ఇప్పుడు అందరి దృష్టి మాత్రం ఓటీటీ విడుదల తేదీపై ఉంది.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాను డిసెంబర్ 12న స్ట్రీమింగ్కు తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది.
ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మించగా, సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఇక అధికారిక ఓటీటీ తేదీ ఎప్పుడు లాక్ అవుతుందో చూడాలి.



.jpg&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!