

క్రైమ్ థ్రిల్లర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఇన్స్పెక్టర్ అవినాష్’ రెండో సీజన్ రేపటినుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్కు రానుంది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అవినాష్ మిశ్రా పాత్రలో రణదీప్ హుడా మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. ఉత్తరప్రదేశ్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ తొలి సీజన్లో గ్యాంగ్ వార్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆపరేషన్లు, రాజకీయ డ్రామాను రియలిస్టిక్‌గా చూపించి మంచి ఆదరణ పొందింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు రెండో సీజన్‌ను మరింత భారీ స్థాయిలో తెరకెక్కించారు.
ప్రాంతీయ భాషా కంటెంట్‌కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈసారి తెలుగు డబ్బింగ్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. క్లిష్టమైన కేసులు, పవర్ఫుల్ విలన్లు, ఉత్కంఠభరిత యాక్షన్ సన్నివేశాలతో సీజన్ 2 మరింత ఆసక్తికరంగా ఉండనుంది. ఊర్వశి రౌటేలా, అమిత్ సాల్, షాలిన్ భానోత్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా, నీరజ్ పాఠక్ దర్శకత్వం వహించారు. వీకెండ్ బింజ్ వాచ్‌కు ఇది బెస్ట్ ఛాయిస్‌గా అభిమానులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!