

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ “కపుల్ ఫ్రెండ్లీ” ఓటీటీలో కూడా మంచి ఆదరణ పొందుతోంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. థియేటర్లలో మంచి వసూళ్లతో సక్సెస్ సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా అదే స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది.
ఈ మూవీతో యూవీ క్రియేషన్స్ సంస్థకు మంచి సక్సెస్ లభించింది. ఈ ఉత్సాహంతో ఇప్పుడు “బైకర్” సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సంస్థ సిద్ధమవుతోంది. సినిమా థియేటర్లలో విడుదలైన సమయంలో యువత సోషల్ మీడియాలో ఈ చిత్రాన్ని విపరీతంగా ప్రశంసించింది. రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ సినిమా బాగుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సినిమాకు మరింత మైలేజ్ వచ్చింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో సినిమా చూసిన ప్రేక్షకులు కూడా “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
.jpeg)
“కపుల్ ఫ్రెండ్లీ” చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. అజయ్ కుమార్ రాజు.పి కో-ప్రొడ్యూసర్గా వ్యవహరించగా, అశ్విన్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విడుదల చేశారు.









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!