

హాలీవుడ్ సైకాలజికల్ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘అబ్సెషన్’ ప్రపంచవ్యాప్తంగా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. సుమారు రూ.7 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1,700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అరుదైన రికార్డు సృష్టించింది. విడుదలైన ప్రతి మార్కెట్లో ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందిన ఈ చిత్రం హారర్ జానర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. భారతదేశంలో కూడా రూ.90 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ విడుదలకు సిద్ధమైంది. జూన్ 30, 2026 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ, ఫాండాంగో ఎట్ హోమ్ వంటి ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్ వేదికల్లో అద్దె విధానంలో అందుబాటులోకి రానుంది. ప్రేమ పేరుతో మొదలైన ఒక యువకుడి కోరిక ఎలా భయానక మోజుగా మారి అతని జీవితాన్ని తలకిందులు చేసిందన్న ఆసక్తికర కథాంశంతో రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో సాధించిన విజయాన్ని ఓటీటీలోనూ కొనసాగిస్తుందా అనే ఆసక్తి నెలకొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!