
గాసిప్స్

తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ‘బాహుబలి’ ప్రయాణాన్ని తిరిగి చూపించే డాక్యుమెంటరీ ‘బాహుబలి: ద టార్చ్ బేరర్’ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 123 నిమిషాల నిడివితో నాలుగు ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్‌లో సినిమా ఆలోచన ఎలా మొదలైంది, ఎలా రూపుదిద్దుకుంది, ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి అన్న విషయాలను వివరంగా చూపించారు. ప్రభాస్, రానా, అనుష్క, రాజమౌళి సహా టీమ్ అంతా తమ అనుభవాలను పంచుకున్నారు.
మొదట వచ్చిన నెగటివ్ టాక్ నుంచి భారీ విజయంగా మారిన ప్రయాణం, ఆర్థిక ఒత్తిడులు, వ్యక్తిగత త్యాగాలు ఇందులో హైలైట్‌గా ఉన్నాయి. అలాగే ‘బాహుబలి’ ప్రభావం జపాన్ నుంచి చిన్న దేశాల వరకు ఎలా విస్తరించిందో భావోద్వేగంగా చూపించారు. అభిమానుల కథలు, ఎమోషనల్ మూమెంట్స్‌తో పాటు చివరలో ‘బాహుబలి 3’పై హింట్ ఇవ్వడంతో డాక్యుమెంటరీ ఆసక్తికరంగా ముగుస్తుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!