
గాసిప్స్
.webp&w=3840&q=75)
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన తాజా పీరియాడిక్ డ్రామా కాంత ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చింది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించగా, సెల్వరాజ్ సెల్వమని దర్శకత్వం వహించారు. రానా దగ్గుబాటి మరియు సముద్రఖని వంటి వెర్సటైల్ నటులు కీలక పాత్రల్లో నటించారు.
సినిమా థియేటర్లలో మంచి ఓపెనింగ్స్ సాధించినప్పటికీ, అంచనాలకు తగ్గ సక్సెస్ మాత్రం సాధించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్లాట్ఫార్మ్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాంత స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నది.
నేటి నుంచి ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లోనే ఈ సినిమాను చూడవచ్చు. ఈ చిత్రానికి దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి నిర్మాతలుగా వ్యవహరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!