

ధురంధర్ 2 ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓటీటీ అప్డేట్ను ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ నెల 14 నుంచి ఓవర్సీస్ ప్రేక్షకులకు ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ‘ధురంధర్: ది రివెంజ్’ పేరుతో 3.52 గంటల నిడివి గల అన్‌కట్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. ఇక భారత్‌లో జియోహాట్‌స్టార్ వేదికగా ఈ నెల 15 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ సినిమా కథ పాకిస్థాన్ నేపథ్యంలో సాగే అండర్‌కవర్ ఆపరేషన్ చుట్టూ తిరుగుతుంది. ఆపరేషన్ ‘ధురంధర్’లో భాగంగా జస్కిరాత్ సింగ్ తన పేరును హమ్జా అలీ మజారీగా మార్చుకుని పాకిస్థాన్‌లోకి ప్రవేశిస్తాడు. అక్కడ బలోచ్ తెగ నాయకుడు రెహమాన్ డెకాయిత్ హత్య అనంతరం గ్యాంగ్ వార్స్ ప్రారంభమవుతాయి. అర్షద్ పప్పు అధికారంలోకి రావడం, ఉజెయిర్ బలోచ్ ప్రతీకారం తీర్చుకోవడం, మేజర్ ఇక్బాల్ ఉగ్రదాడి ప్రణాళికలను అడ్డుకునే హమ్జా ప్రయత్నాలు కథలో ప్రధానాంశాలుగా ఉంటాయి. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!