
క్రీడలు

డెకాయిట్ అనే రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టిన వెంటనే భారీ ఆదరణను సొంతం చేసుకుంది. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రస్తుతం ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే ప్రైమ్ వీడియో ఇండియా ట్రెండింగ్ జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకుని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
దర్శకుడు షనీల్ డియో తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!