
గాసిప్స్

అంకిత్ కొయ్య హీరోగా, నిలఖి పాత్రా హీరోయిన్గా నటించిన క్యూట్ ఎమోషనల్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా 'బ్యూటీ' జనవరి 2 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. 2025 సెప్టెంబర్ 19 న థియేటర్స్‌లో విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఈ తెలుగు చిత్రం, యువత ప్రేమకథతో పాటు కూతురిపై తండ్రి అపరిమిత ప్రేమను హృదయంగా చూపిస్తుంది.
అలేఖ్య (నిలఖి పాత్రా), అర్జున్ (అంకిత్ కొయ్య) ప్రేమించుకుంటారు. అలేఖ్య తండ్రి నారాయణ (వీకే నరేష్) క్యాబ్ డ్రైవర్‌గా, కూతురికి బర్త్‌డే గిఫ్ట్‌గా టూ - వీలర్ కొనిస్తానని హామీ ఇస్తాడు. అర్జున్ కూడా అదే వాగ్దానం చేస్తాడు. తండ్రి మాట నిలబెట్టుకోకపోవడంతో అలేఖ్య కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోతుంది. ఆ నిర్ణయం వల్ల అర్జున్, నారాయణ ఎదుర్కొన్న ఇబ్బందులు, అలేఖ్య పడిన కష్టాలు, తండ్రి ఆమెను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలే చిత్ర కథాంశం.


















.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!