

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటించిన రీసెంట్ హిట్ చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’ అమెజాన్ ప్రైమ్‌లో టాప్ ట్రెండింగ్‌గా దూసుకుపోతోంది. సంపత్ రుద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ కథానాయికగా నటించగా, ‘ఇష్టంగా’ ఫేమ్ అర్జున్ మహీ విలన్ పాత్రలో ఆకట్టుకున్నారు. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ సంస్థలపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మించారు. థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ సినిమా ఇటీవల ఓటీటీలో విడుదలై అమెజాన్ ప్రైమ్‌లో సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. చంద్రహాస్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రానికి కథ ఎంఏ తిరుపతి అందించగా, మాటలు రమేష్ రాయ్ రాశారు. వైఆర్ శేఖర్ సినిమాటోగ్రఫీ, ఆర్ఆర్ ద్రువన్ సంగీతం, బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!