

అంతర్జాతీయ రొమాంటిక్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకుల కోసం మోస్ట్ అవేటెడ్ సిరీస్ ‘సోల్ మేట్’ ఈరోజునుంచే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. కొరియన్, జపనీస్ సంస్కృతుల కలయికతో రూపొందిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామా ప్రేక్షకులను భావోద్వేగ ప్రయాణంలోకి తీసుకెళ్లనుంది. బెర్లిన్ నేపథ్యంలో సాగే ఈ కథలో విభిన్న నేపథ్యాలున్న ఇద్దరి మధ్య పదేళ్ల పాటు కొనసాగే బంధాన్ని హృదయాన్ని హత్తుకునేలా చూపించారు. నేటి యువతకు కనెక్ట్ అయ్యే భావోద్వేగాలు, ప్రేమ, స్నేహం ఈ సిరీస్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
ప్రస్తుతం ఈ సిరీస్ జపనీస్, కొరియన్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండగా తెలుగు, హిందీ సబ్టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. తెలుగు, హిందీ డబ్బింగ్ వెర్షన్లపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఎమోషనల్ సీన్స్తో పాటు మెచ్యూర్ కంటెంట్ కూడా ఉండటంతో ఈ సిరీస్కు ప్రత్యేక రేటింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ షోపై భారీ చర్చ జరుగుతుండగా, ఓటీటీ ప్రేక్షకులు దీనిని వీకెండ్ బెస్ట్ రొమాంటిక్ డ్రామాగా అభివర్ణిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!