

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా నటించిన ‘బ్లాస్ట్’ చిత్రం థియేటర్లలో మంచి స్పందన అందుకున్న తర్వాత ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. సుభాష్ కె. రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, అభిరామి, జాన్ కొక్కెన్ కీలక పాత్రలు పోషించారు. మే 28న విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు నమోదయ్యాయి. నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా, జూన్ 25 నుంచి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
మరోవైపు జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ కూడా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అవతార్ ఫ్రాంచైజీలో భాగమైన ఈ చిత్రం థియేటర్లలో మంచి విజయాన్ని సాధించింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకోగా, జూన్ 24 నుంచి తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!