

కొన్ని సినిమాలు భారీ అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంటాయి. ఇమ్రాన్ హష్మి నటించిన అవారాపన్ 2 కూడా అలాంటి చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. 2007లో వచ్చిన అవారాపన్కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. సుమారు రూ.45 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.213 కోట్ల వరకు వసూళ్లు సాధించినట్లు సమాచారం. తాజాగా పెద్దగా ప్రచారం లేకుండానే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ విధానంలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో ఉచిత స్ట్రీమింగ్కు కూడా వచ్చే అవకాశం ఉంది.
అవారాపన్ 2 కథ విషయానికి వస్తే.. ఆలియా హమిద్ మరణం శివమ్ పండిట్‌ను తీవ్రంగా కలచివేస్తుంది. ఆమె పుట్టినరోజున నివాళులు అర్పించేందుకు సమాధి వద్దకు వెళ్లిన శివమ్‌కు అక్కడ ఓ పసికందు కనిపిస్తుంది. ఆ చిన్నారికి ఆలియా అని పేరు పెట్టి అనాథాశ్రమంలో చేర్పిస్తాడు. పదేళ్ల తర్వాత ఆలియాను ఓ జంట దత్తత తీసుకుంటుంది. అయితే గుర్తుతెలియని వ్యక్తులు ఆ దంపతులను హత్య చేసి చిన్నారిని కిడ్నాప్ చేస్తారు. ఆలియాతో పాటు మరికొందరు పిల్లలను బ్యాంకాక్‌కు తరలిస్తారు. అధికారికంగా ఆ గ్యాంగ్‌ను పట్టుకోవడం కష్టమని భావించిన ఇంటర్‌పోల్ అధికారి సమ్రత్.. శివమ్ సహాయం కోరతాడు. దీంతో ఆలియాను రక్షించేందుకు శివమ్ బ్యాంకాక్‌కి బయలుదేరుతాడు. అక్కడ అతడికి ఎదురైన పరిస్థితులు, చివరకు ఆలియాను కాపాడాడా లేదా అనేదే సినిమా కథ.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!