

అమెరికా దాడి చేస్తుందనే భయాలు, ఆర్థిక ఆంక్షల ప్రభావంతో ఇరాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ పరిణామాల మధ్య ఇరాన్ కరెన్సీ రియాల్ మరోసారి భారీగా పతనమైంది. డాలర్‌తో పోల్చితే రియాల్ విలువ చరిత్రలోనే కనిష్టానికి చేరి, ఒక డాలర్‌కు ఏకంగా 15 లక్షల రియాల్స్‌కు పడిపోయింది. 2015 లో అణు ఒప్పందం సమయంలో ఒక డాలర్‌కు 32 వేల రియాల్స్ ఉన్న పరిస్థితి నుంచి ఇది తీవ్రమైన పతనంగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఇక అమెరికా - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌక పశ్చిమాసియాకు చేరుకోవడంతో పాటు, ఫైటర్ జెట్లు మరియు మిలిటరీ విమానాల తరలింపుపై కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా దాడి చేస్తే తగిన ప్రతిస్పందన తప్పదని ఇరాన్ హెచ్చరిస్తోంది. టెహ్రాన్‌లో అమెరికాను హెచ్చరిస్తూ బిల్‌బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పశ్చిమాసియా దేశాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!