

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు జరిగిన రక్షణ సమీక్షా సమావేశంలో ప్రకటించారు, "ఇరాన్ మిలటరీ సామర్థ్యాలను అమెరికా దళాలు 100% నాశనం చేశాయి". ఇప్పుడు ఇరాన్ ఒక తల తెగిపడిన దేశంలా మారింది, ఇక అటువంటి దేశం నుంచి ప్రపంచానికి ఎలాంటి ముప్పు ఉండదు.
ప్రస్తుతం ఇరాన్ తీర ప్రాంతాలపై అమెరికా దాడులు కొనసాగుతున్నట్లు. అతి త్వరలో ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హోర్ముజ్ జలసంధిని అమెరికా తిరిగి ఓపెన్ చేస్తుందని, హోర్ముజ్ మార్గాన్ని మరింత సురక్షితంగా, స్వేచ్ఛాయుతంగా ఉంచే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుమించి, చైనా, ఫ్రాన్స్, జపాన్, సౌత్ కొరియా, యూకే వంటి దేశాలను ఈ ఆపరేషన్లో భాగస్వామ్యంగా పాల్గొని వాణిజ్య నౌకలను రక్షించాలని ఆయన కోరారు.
ఈ ప్రకటన తర్వాత మధ్యప్రాచ్య ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ నావికా దళం, వాయు సేన స్థావరాలను అమెరికా పూర్తిగా ధ్వంసం చేసిన తర్వాత, హోర్ముజ్ మార్గం ద్వారా చమురు సరఫరా పునరుద్ధరించబడే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికా తన భారీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు, మెరైన్ సైనికులను ఆ ప్రాంతంలో మోహరించి స్థిరంగా తన ప్రభావాన్ని చూపుతోంది.






.jpg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!