
జనరల్

అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్ నేవీ కమాండర్ షారమ్ ఇరానీ శత్రు బలగాలపై త్వరలో కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తామని హెచ్చరించారు. ఆ ఆయుధం శత్రువులను తీవ్రంగా భయపెడుతుందని, కానీ దాని వివరాలు వెల్లడించలేదని తెలిపారు.
ఇరాన్ హార్మూజ్ జలసంధిపై ఆంక్షలు ఎత్తివేస్తేనే చర్చలు జరుగుతాయని చేసిన ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. అణు ఒప్పందం కుదిరే వరకు దిగ్బంధనం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిలో ఉందని, పరిస్థితి మరింత కఠినంగా మారుతుందని హెచ్చరించారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!