

టాలీవుడ్‌లో జూన్ నెలలో భారీ బాక్సాఫీస్ పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా సంక్రాంతి సమయంలో మాత్రమే కనిపించే ఈ పోటీ ఈసారి మధ్యలోనే జరగబోతోంది. రామ్ చరణ్ తన పెద్ది సినిమాతో విడుదలకు సిద్ధమవుతుండగా, సమంత మా ఇంటి బంగారం సినిమాతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.
మా ఇంటి బంగారం సినిమాను ముందుగా వచ్చే నెలలో విడుదల చేయాలని భావించినప్పటికీ, ప్రస్తుతం పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వాయిదా వేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌ల కారణంగా ప్రేక్షకుల దృష్టి ఎక్కువగా క్రీడలపై ఉండటంతో, జూన్ 4న విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఇదే సమయంలో రామ్ చరణ్ పెద్ది సినిమా కూడా జూన్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే రంగస్థలం సినిమాలో కలిసి నటించిన ఈ ఇద్దరూ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద పోటీ పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పోటీ టాలీవుడ్‌లో ఈ ఏడాది పెద్ద హైలైట్‌గా మారే అవకాశముంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!