
జనరల్

జమ్మూకశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపుతూ సోషల్ మీడియాలో నెట్‌వర్క్ మ్యాప్‌ను పోస్ట్ చేసిన నేపథ్యంలో నేపాల్ ఎయిర్‌లైన్స్ భారత్‌కు క్షమాపణలు తెలిపింది. ఈ పోస్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో సంస్థ వెంటనే స్పందించి నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.
తమ మ్యాప్‌లో సాంకేతిక లోపాల కారణంగా ఈ తప్పిదం జరిగిందని నేపాల్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది. దేశాల సరిహద్దుల విషయంలో ఇది నేపాల్ లేదా సంస్థ అధికారిక వైఖరిని ప్రతిబింబించదని స్పష్టం చేసింది. ఈ తప్పిదంపై చింత వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!