
క్రీడలు

ఇన్ఫోసిస్ సంస్థ ఉద్యోగులకు మరియు ఉద్యోగార్థులకు శుభవార్త తెలిపింది. సంస్థ సీఈఓ సలీల్ పరేఖ్ మాట్లాడుతూ ఉద్యోగాల తొలగింపులు ఉండవని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో కొత్త నియామకాలు చేయడంతో పాటు ఉద్యోగుల నైపుణ్యాలను పెంచేందుకు దృష్టి సారించనున్నట్లు తెలిపారు.
కృత్రిమ మేధస్సు కారణంగా ఉద్యోగాలు తగ్గవని కూడా ఆయన చెప్పారు. ఉద్యోగులకు కృత్రిమ మేధస్సుకు సంబంధించిన శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని మరింత మెరుగుపరచి సంస్థను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 వేల మంది కొత్త ఉద్యోగులను నియమించుకునే ప్రణాళికలో ఉన్నట్లు తెలిపారు. ఇతర పెద్ద సంస్థలు ఖర్చులను తగ్గించేందుకు మార్పులు చేస్తున్న సమయంలో, ఈ నిర్ణయం ఉద్యోగార్థుల్లో ఆశలు పెంచుతోంది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!