
గాసిప్స్

విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై సోమవారం కూడా ట్రాఫిక్ రద్దీ తగ్గలేదు. సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్లిన ప్రయాణికులు తిరిగి నగరాలకు చేరుకోవడంతో హైవేపై వాహనాల రాకపోకలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్ వైపు వెళ్లే దారుల్లో ఉదయం నుంచే వాహనాలు బారులు తీరాయి.
హైదరాబాద్ శివారు ప్రాంతాలైన అబ్దుల్లాపూర్ మెట్, హయత్నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్ పరిసరాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆదివారం మౌనీ అమావాస్య సందర్భంగా చాలామంది ప్రయాణాన్ని వాయిదా వేసి సోమవారం బయల్దేరడంతో ట్రాఫిక్ మరింత పెరిగిందని అధికారులు తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!