
గాసిప్స్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్తోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికలు జరిగే 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లలో బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించింది. ఈసారి ఈవీఎంలతో నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ బ్యాలెట్ పేపర్ వైపే మొగ్గు చూపారు. ఈ నెల 10 న తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది.
గతంలో 2014 లో ఈవీఎంలతో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 2020 లో కోవిడ్ కారణంగా బ్యాలెట్ పేపర్తో నిర్వహించారు. ఇప్పుడు మళ్లీ బ్యాలెట్ విధానాన్నే ఎంచుకోవడంతో ఎన్నికల ప్రక్రియపై ఆసక్తి నెలకొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!