
న్యూస్

ఈ నెల 15 నుంచి తెలంగాణలో తీవ్ర ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. మొదట ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో ఈ ప్రభావం కనిపించనుండగా, గాలివానలతో పాటు భారీ మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. రైతులు తమ పంటలను రక్షించుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ నెల 16, 17 తేదీల నుంచి తెలంగాణ అంతటా తీవ్ర ఉరుములు, వడగళ్ల వానలు మరియు ఈదురు గాలులతో కూడిన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. మరోవైపు, వచ్చే రెండు నుంచి మూడు రోజుల్లో తీవ్ర ఎండల పరిస్థితులు కూడా కొనసాగనున్నాయని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు పంటలను సంరక్షించుకోవాలని సూచించారు.








.jpg&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!