
అక్రమంగా గృహ ఎల్పీజీ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న వారిపై పౌర సరఫరాల శాఖ (CAF & CS) ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కఠిన చర్యలు చేపట్టింది. మార్చి 9న హన్మకొండ, వరంగల్, కర్మన్‌ఘాట్ ప్రాంతాల్లో అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 22 గృహ సిలిండర్లు, 25 చిన్న సిలిండర్లు, గ్యాస్ రీఫిల్లింగ్ యూనిట్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సామగ్రి విలువ సుమారు రూ.64,468గా అధికారులు వెల్లడించారు.
ఇదే తరహా చర్యల్లో భాగంగా ఫిబ్రవరి 14న ఇబ్రహీంపట్నం బొంగులూరులో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని 78 గృహ ఎల్పీజీ సిలిండర్లు, ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఈ దాడుల్లో 100 గృహ సిలిండర్లు, 25 చిన్న సిలిండర్లు స్వాధీనం అయ్యాయి. వీటి మొత్తం విలువ రూ.2,36,068గా అంచనా వేశారు. ఈ కేసులపై కలెక్టర్ (సివిల్ సప్లైస్) ముందు 6-A నివేదికలు సమర్పించగా, సంబంధిత వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదు చేశారు. ఎల్పీజీ సిలిండర్ల అక్రమ వినియోగంపై సమాచారం ఉంటే ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ 1967కు ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!