

క్విక్ కామర్స్ సేవలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. పది నిమిషాల డెలివరీ నిబంధనను నిలిపివేసేందుకు ఆయా సంస్థలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జొమాటోకు చెందిన క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ ఈ సేవను ఉపసంహరించుకునే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గిగ్ కార్మికుల భద్రత, రక్షణ మరియు మెరుగైన పని పరిస్థితులు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్స్టామార్ట్ వంటి సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పది నిమిషాల డెలివరీ నిబంధనను తొలగించేలా సంస్థలను ఒప్పించినట్లు సమాచారం. ఇదే అంశంపై ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా పార్లమెంట్లో ప్రస్తావిస్తూ, ఈ విధానం వల్ల కార్మికులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, దీనిని నిషేధించాలని డిమాండ్ చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!