

విదేశీ విద్యార్థుల కోసం రూపొందించిన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) కార్యక్రమంపై అమెరికా ప్రభుత్వం సమీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించింది. అమెరికా కార్మికుల ప్రయోజనాలను కాపాడడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుత విధానం జాతీయ భద్రతా ప్రయోజనాలు, పన్ను నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో పరిశీలించనున్నట్లు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది. ఈ సమీక్షతో వర్క్ పాలసీలపై చర్చ మళ్లీ వేడెక్కే అవకాశం ఉంది.
ఒక వేళ ఓపీటీ కార్యక్రమంపై కఠిన ఆంక్షలు విధిస్తే భారత్ సహా అనేక దేశాలకు చెందిన వేలాది విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. చదువు పూర్తయ్యాక అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగ అనుభవం పొందేందుకు ఓపీటీ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. విధానంలో మార్పులు చోటుచేసుకుంటే విదేశీ విద్యార్థుల ఉపాధి అవకాశాలు మరియు భవిష్యత్ ప్రణాళికలపై ప్రభావం పడే అవకాశముంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!