
గాసిప్స్

మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ భార్య, ఎండోక్రినాలజిస్ట్ సీనియర్ వైద్యురాలు డాక్టర్ సూచి యాష్కికి అమెరికాలో కారు ప్రమాదంలో గాయాలు అయ్యాయి. బోస్టన్‌లోని హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ ఆసుపత్రిలో ఎండి కోర్సులో కుమార్తె డాక్టర్ గగన యాష్కిని జాయిన్ చేసి న్యూయార్క్‌కు తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. వర్షం కారణంగా కారు అదుపుతప్పి పల్టీలు కొట్టినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో డాక్టర్ సూచి యాష్కికి రిబ్స్ విరిగినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. మధుయాష్కి గౌడ్ కూడా అమెరికాలోనే ఉన్నారు. కుమార్తె కాన్వాకేషన్ కోసం వెళ్లిన ఆయన రేపు ఇండియాకు తిరిగి రావాల్సి ఉండగా ఈ ఘటన జరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!