
సినిమాలు

పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఉత్తర కొరియా మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. జపాన్ వైపు సముద్రంలోకి ఒకేసారి 10 బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. రాజధాని ప్యాంగ్యాంగ్ సమీప ప్రాంతం నుంచి ఈ క్షిపణులు ప్రయోగించినట్లు అధికారులు తెలిపారు.
అమెరికాతో కలిసి దక్షిణ కొరియా నిర్వహించిన సంయుక్త సైనిక విన్యాసాలకు ప్రతిస్పందనగా ఈ మిస్సైల్ పరీక్షలు జరిపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన తర్వాత ప్రాంతంలో భద్రతా చర్యలను పెంచినట్లు దక్షిణ కొరియా తెలిపింది. అలాగే ఈ విషయాన్ని అమెరికా మరియు జపాన్ ప్రభుత్వాలతో పంచుకున్నట్లు అధికారులు వెల్లడించారు.







.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!