

తమిళ స్టార్ హీరో సూర్య మరోసారి కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వీరభద్రుడు’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికేట్ పొందింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందుతోంది. ఇందులో హీరోయిన్‌గా త్రిష కృష్ణన్ నటించగా, ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ మాయరవి వంటి నటులు కీలక పాత్రల్లో మెరిసినట్లు సమాచారం.
ఈ చిత్రానికి సంగీతాన్ని సాయి అభ్యంకర్ అందించగా, సినిమాటోగ్రఫీని జీకే విష్ణు నిర్వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమా విజువల్‌గా ఎంతో గ్రాండ్‌గా ఉండబోతుందని సూచిస్తున్నాయి. ఈ నెల 14న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్, ఎమోషన్, మాస్ అంశాలతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని, సూర్య పాత్రలోని తీవ్రతతో పాటు సామాజిక సందేశం కూడా ప్రత్యేకంగా నిలుస్తుందని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!