
.jpg&w=3840&q=75)
ప్రపంచ టెక్ రంగాన్ని వరుసగా లే ఆఫ్స్ వేధిస్తున్న వేళ, ఆ ప్రభావం యాపిల్ వరకు చేరింది. భారీ ఆదాయాన్ని నమోదు చేస్తున్నప్పటికీ, సంస్థ డజన్ల మంది సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్టు సమాచారం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా 20 నుంచి 30 ఏళ్లపాటు సేవలందించిన సీనియర్ ఉద్యోగులకే నోటీసులు వెళ్లినట్టు తెలుస్తోంది.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, యాపిల్ గ్లోబల్ సేల్స్ ఆపరేషన్ల విభాగంలో పని చేస్తున్న పలువురిని బయటకు పంపించింది. కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, విద్యాసంస్థలతో వ్యవహరించే సేల్స్ టీం లకు చెందిన ఉద్యోగులే ఎక్కువగా ప్రభావితమయ్యారు. కొత్త కస్టమర్లకు ఉత్పత్తులను పరిచయం చేసే బ్రీఫింగ్ సెంటర్ సిబ్బంది కూడా ఈ జాబితాలో ఉన్నారు.
ఎంతమందిని పూర్తిగా తొలగించారన్న వివరాలు ఇంకా స్పష్టంగా వెల్లడించలేదు. లే ఆఫ్స్ నోటీసులు అందుకున్న వాళ్లు జనవరి 20 లోపు యాపిల్‌లో మరో పోస్టుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అవకాశం రానిపక్షంలో సెవరెన్స్తో ఉద్యోగ విరమణ తప్పదని సంస్థ తెలియజేసినట్టు తెలిసింది.
140 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం రాబడుతున్న యాపిల్ వంటి దిగ్గజ సంస్థ ఉద్యోగులను తొలగించడం. టెక్ ఉద్యోగుల్లో ఆందోళనను పెంచుతోంది.













.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!